శ్రీమదాంధ్ర మహాభాగవతము
మహాకవి బమ్మెర పోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవతము
Friday, March 04, 2016
1-6 క్షోనితలంబు
1-6. ఉత్పలమాల
క్షోనితలంబు నెన్నుదురు సోఁకఁగ మ్రొక్కినుతింతు సైకత
శ్రోణికిఁ జంచరీకచయసుందరవేణికి రక్షితానత
శ్రేణికిఁ దోయజాతభవ చిత్తవశీకరణైక వాణికి
వాణికి నక్షదామ శుక వారిజ పుస్తక రమ్యపాణికిన్.
* * *
మునుపటి
తదుపరి
Newer Post
Older Post
Home